చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం చెక్. యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కల్యాణీ మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్పెషల్ గెస్ట్‌గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విచ్చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్‌లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement