Friday, November 22, 2024

చిక్కుల్లో యూట్యూబ్ హీరో

సినిమాలతోనే కాదు యూట్యూబ్ వల్ల కూడా సెలబ్రిటీ హోదాని దక్కించుకుంటున్నారు పలువురు. వారిలో ఒకడైన షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. యూట్యూబ్ ని తన అడ్డాగా మార్చుకొని సంచలనాలు సృష్టిస్తున్నాడు జస్వంత్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరకడమే కాదు యాక్సిడెంట్ కూడా చేశాడీ కుర్రాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రెండు కార్లు రెండు బైకులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. దాంతో ఇన్ని రోజులు ఈయనను పొగిడిన నోళ్లే ఇప్పుడు తిడుతున్నాయి. ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో తన వీడియోలతో బాగా వైరల్ అయిన షణ్ముఖ్.. ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాడు. గత 24 గంటల్లో ఈ కుర్రాడి వార్త ట్రెండింగ్ గా మారింది. దాంతో ఇన్ని రోజులు ఎంతో కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం ఒకే ఒక సంఘటనతో కుప్పకూలిపోయింది. కళ్ళముందే తను తెచ్చుకున్న గుర్తింపు కింద పడిపోయింది. ఈ మధ్యే సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తో స్టార్ అయిపోయాడు షణ్ముఖ్ జస్వంత్. ప్రస్తుతం ఈయన సూర్య అనే మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడటం.. యాక్సిడెంట్ చేయడం లాంటివి షణ్ముఖ్ ఇమేజ్ ని దారుణంగా దెబ్బ తీశాయి. తన స్నేహితులలో ఒకరితో వచ్చిన గొడవ కారణంగానే ఈయన మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ చేసిన కారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. వాహనాన్ని సీజ్ చేసి షణ్ముఖ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కూడా అరేయ్ ఏంట్రా ఇది అంటూ యూట్యూబ్ లో  చాలా సాఫ్ట్ గా కనిపించే కుర్రాడు రియల్ లైఫ్ లో మాత్రం ఒక ఇన్సిడెంట్ తో బ్యాడ్ బాయ్ ముద్ర వేయించుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement