కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని. బాలీవుడ్ నన్ను అంగీకరించేందుకు చాలా సమయం పట్టింది. మొదట్లో నేను ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఏ పాత్ర వచ్చినా చేయాలని అనుకునేదాన్ని. ఇప్పుడు పాత్రల ఎంపికలో నాకు స్వేచ్ఛ దొరికింది. పరిశ్రమ నుంచి ప్రోత్సాహం దొరికింది. ప్రతిభ ఉంటే ఇక్కడ ఎవరైనా రాణించవచ్చు. కాకపోతే కాస్త సహనం కావాలి. ప్రేక్షకులు మనల్ని అంగీకరిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అయితే ప్రేక్షకుల అంగీకారం పొందాలంటే మనలో ప్రతిభ ఉండాల్సిందేనని వివరించిందీ బ్యూటీ.
Advertisement
తాజా వార్తలు
Advertisement