Friday, November 22, 2024

క్రాష్ డైట్స్ వద్దంటోన్న రాశీఖన్నా

“ఫిట్నెస్ పరంగా ఇది గొప్ప సంవత్సరం. ఇక్కడ నా శిక్షకుడు కుల్ దీప్ నన్ను మ్యాగ్జిమమ్ కరెక్ట్ చేశారు ఫిజికల్ లుక్ పరంగా. ఎంతో జాగ్రత్తగా నిర్మించిన వ్యాయామ నియమావళి కఠినమే కానీ ఆరోగ్యకరమైన ఆహారంతో గొప్ప ఫలితాలను అందిస్తానని నాకు వాగ్దానం చేశాడు . నేను స్వచ్ఛమైన శాఖాహారిని కాబట్టి కుల్దీప్ ఓకే అనిపించాడు. అయితే చాలా కష్టపడి ప్రతిదీ చదువుకోవలసి వచ్చింది.. అని తెలిపింది. ఆరోగ్యంగా ఉన్న శరీరం తో ఈ స్థాయికి చేరడానికి సహాయం చేసినందుకు డైట్ స్పెషలిస్ట్ కుల్ దీప్.. ట్రైనర్ రాజేష్ కి ధన్యవాదాలు తెలిపింది. నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఎప్పుడూ సాధించాలనుకున్నదానికి చేరువగా ఉన్నానన్నది ఊహిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది.  ఇంకా చాలా దూరం వెళ్ళాలి. శరీరాన్ని ద్వేషించడం వల్ల కాదు.. ప్రేమిస్తే వ్యాయామం చేయాలి. దయచేసి క్రాష్ డైట్స్ చేయవద్దు .. ఇది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది ..! ఆరోగ్యకరమైన విధానాన్ని ఎంచుకోవడం “నెమ్మదిగా స్థిరంగా రేసును గెలుచుకునేందుకు సాయపడుతుంది!” అని రాశీ ఫిట్నెస్ శిక్షణకు సంబంధించిన చాలా మంచి విషయాలే తెలిపింది. ప్రస్తుతం టాలీవుడ్ లో రాశీ ఖన్నా కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా అటు తమిళంలో నటిస్తోంది. తమిళంలో సైతాన్ కా బచ్చా రిలీజ్ కావాల్సి ఉంది. ఆరణ్మయి 3- తుగ్లక్ దర్బార్- మేధావి సెట్స్ పై ఉన్నాయి. ఇవన్నీ తమిళ చిత్రాలే. భ్రమం అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తోందీ తార.

Advertisement

తాజా వార్తలు

Advertisement