Tuesday, September 17, 2024

కొత్త చిత్రాన్ని నిర్మించనున్న ‘అనుష్కశర్మ’

కొత్త సినిమాల్ని ప్రారంభించనుందట బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ.  జనవరిలో ఒక బిడ్డకు జన్మనిచ్చారామె. ఏడాది కాలంగా ఈ భామ సినిమాలకు దూరంగా ఉంది.  ఫ్రెగ్నెన్సీ వల్లనే ఇన్నాళ్లు కుదరలేదు. ఇక పై కొత్త సినిమాల్ని ప్రారంభించనున్నారట. అలాగే నిర్మాతగానూ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేస్తున్నారట. అతి త్వరలోనే ఒక కొత్త చిత్రాన్ని నిర్మించటానికి అనుష్క సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి ఆఫ్ఘన్ అనే టైటిల్ ని నిర్ణయించారు. అన్షాయ్ లాల్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. నిర్మాతగా అనుష్క తొలి నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. అసాధారణ విజయాలు అందుకుంటున్నారు. ఈసారి కూడా మంచి టైటిల్ తో కాన్సెప్ట్ ఉన్న సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ లో ప్రముఖ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మొన్ననే బిడ్డను కంది..ఈలోగానే మొదలెట్టేస్తోందా.. అంటూ ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement