Friday, November 22, 2024

కాలం గడిచే కొద్దీ కష్టం తీరుతుంది: రేణూ దేశాయ్

నటీ రేణూ దేశాయ్ ఇండియాలో కరోనా మహమ్మారి ఉద్ధృతిపై స్పందించారు. ఇప్పటికే ఎన్నో బాధలను లెక్కలేనంతగా భరించామని, వాటిని మోసి, గాడిదల్లా తయారయ్యామని అభిప్రాయపడ్డ ఆమె, కేవలం బాధ పడేందుకు మాత్రమే ఈ శరీరం లేదని, బాధల్లోనూ చిన్న చిన్న సంతోషాలు వెతుక్కోవాలని సూచించారు. కాస్తంత సంతోషంగా గడిపేందుకు కామెడీ వీడియోలను లేదా క్యూట్ గా ఉండే కుక్కపిల్లల వీడియోలను చూడాలని సూచించిన ఆమె, కాలం గడిచేకొద్దీ కష్టాలు కూడా తీరుతాయని చెప్పుకొచ్చారు. జాగ్రత్తలు పాటిస్తూ, సురక్షితంగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది అంటూ ధైర్యం చెప్పుకొచ్చారు. దాంతో కొంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చని, తద్వారా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి ఉపశమనం కలుగుతుందని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement