కాబోయే భర్తకి బర్త్ డే విషెస్ తెలిపింది హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ భిష్ణోయ్ మనుమడు భవ్య బిష్ణోయ్‌తో ఏడడుగులు వేయనుంది. మార్చి 13న వీరి నిశ్చితార్థం రాజస్థాన్‌లోని జోద్పూర్ విల్ల ప్యాలెస్‌లో జరగనుండగా, ఇది పూర్తైన కొద్ది రోజులకు వివాహ వేడుక జరిపించనున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమిదని, జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మెహరీన్ చెప్పింది. ఈ రోజు ఫిబ్రవరి 16న తనకు కాబోయే భర్త భవ్యకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అతనితో దిగిన ఫొటో షేర్ చేసింది. ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement