Monday, November 11, 2024

కథ రాయడానికి ఆరు నెలలు పట్టింది..

కథ రాయడానికి ఆరు నెలలు పట్టిందని తెలిపాడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన.డు. సుకుమార్ ద‌గ్గ‌ర రంగ‌స్థ‌లం సినిమాకు అసోసియేట్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ఉప్పెన సినిమా తీయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింద‌న్నాడు బుచ్చిబాబు .’నేను బేసిక్ థీమ్ లైన్‌ను సుకుమార్ కు వినిపించాను. ఆయ‌న చాలా ఇంప్రెస్ అయ్యారు. స్టోరీ లైన్ ను డెవ‌ల‌ప్ చేయాల‌ని నాతో చెప్పారు. క‌థ రాయడానికి ఆరు నెల‌లు స‌మ‌యం ప‌ట్టింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సుకుమార్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌థ వినిపించాను. క‌థ విన్న వెంట‌నే ఎక్జ‌యిట్ అయిన సుకుమార్ న‌న్ను ఆప్యాయంగా హ‌త్తుకున్నారు. త‌న‌కు పుత్రోత్సాహం లాంటి భావ‌న క‌లుగుతుంద‌ని సుకుమార్ నాతో అన్నారు. సుకుమార్ తో ప‌నిచేయ‌డం అద్భుత‌మైన అనుభ‌వం. ఇత‌రుల‌కు క్రెడిట్ ఇచ్చే విష‌యంలో ఆయ‌న ఎప్పుడూ ముందుంటారు. బుచ్చిబాబు లేకుంటే రంగ‌స్థ‌లంలో చిట్టిబాబు పాత్ర లేనే లేద‌ని సుకుమార్  చెప్ప‌డం ఆయ‌న గొప్ప మ‌న‌సుకు ఉదాహ‌ర‌ణ‌. నేను కూడా సుకుమార్ పాత్ర ఆధారంగా ఓ కథ రాసుకున్నాన‌ని’ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement