పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి నాలుగవ భార్యగా ఉంటానని చెప్పింది అషూరెడ్డి. అచ్చం సమంత పోలికలతో ఉండే అషూరెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్‌ని కలిసి అతనితో రెండు గంటల సేపు మాట్లాడే అవకాశం దక్కడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ అమ్మడు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. నా దేవుడిని మళ్లీ కలుసుకునే అవకాశం దక్కింది. రెండు గంటల పాటు మేమిద్దరం మాట్లాడుకోగా, ఆయన నాతో పాటు నేను వేసుకున్న టాటూ గుర్తుందని చెప్పారు. తిరిగి వెళ్లేటప్పుడు.. ఆయన స్వదస్తూరితో రాసిన లెటర్ ఇచ్చి పంపారు. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ పవన్ కళ్యాణ్’ అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. అలానే తనకు ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శకుడు క్రిష్‌కు కృతఙ్ఞతలు అంటూ పేర్కొంది. అయితే ఓ నెటిజన్ అషూని.. పవన్ కళ్యాణ్ నాలుగవ భార్యగా ఉంటారా, అని ప్రశ్నించగా అందుకు వెంటనే ఎస్ అని చెప్పింది అషూ. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement