Friday, November 22, 2024

ఇన్ హెలర్స్ ఉపయోగించడంలో సిగ్గుపడొదన్న నటి

నాకు బ్రాంకియల్ ఆస్తమా ఉందని తెలిపింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఐదేళ్ల వయసులో  పాలు, చాక్లెట్ల నుంచి బయటపడాల్సిన చిన్నారికి, ఆ వయసులో ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం తనకింకా గుర్తుందని చెప్పింది.  ‘‘ప్రతి శీతాకాలంలోనూ, దుమ్ము ధూళిలోకి వెళ్లిన ప్రతిసారీ బ్రాంకియల్‌ ఆస్తమా లక్షణాలు మరింత పెరిగేవి. ఆ పరిస్థితుల నుంచి బయట పడటానికి ఇన్‌హెలర్స్‌ ఉపయోగించడం ప్రాంభించా. వెంటనే మార్పు కనిపించేది. అందువల్ల, ఎప్పుడూ నావెంట ఓ ఇన్‌హెలర్‌ తప్పకుండా ఉండేలా చూసుకుంటా. మన దేశంలో చాలామందికి ఇన్‌హెలర్స్‌ అవసరం. అయితే, సామాజిక కళంకంగా భావించి ఎవరూ వెంట ఉంచుకోరు. పబ్లిక్‌గా అయినా… ప్రైవేట్‌గా అయినా… ఇన్‌హెలర్స్‌ ఉపయోగించడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిద్దాం. సే ఎస్‌ టు ఇన్‌హెలర్స్‌’’ అని సోషల్ మీడియాలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement