రీసెంట్ గా మాస్టర్ చిత్రం విడుదలైంది. ఆ చిత్రంలో హీరోగా తమిళ స్టార్ విజయ్..విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఆండ్రియా కూడా నటించింది. అయితే తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత వుందని చెప్పడంతో ఆ పాత్రలో నటించేందుకు ఆండ్రియా ఓకే చెప్పిందట. విజయ్ వంటి స్టార్ హీరో చిత్రం కనుగ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. చిత్రం విడుదలైన తర్వాతే ఆమెకు అసలు విషయం తెలియవచ్చింది. ఈ చిత్రంలో తన పాత్ర కేవలం డమ్మీలాంటిదని గ్రహించింది. ఇదే విషయాన్ని సినీ విమర్శకులు సైతం చెప్పుకొచ్చారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆండ్రియా.. ఓ కఠిన నిర్ణయం తీసుకుందట. ఇకపై కథలో తనకు ప్రాధాన్యం ఉన్నటువంటి చిత్రాల్లోనే నటించాలన్న నిర్ణయానికి వచ్చిందట. అంటే కెరీర్ ఆరంభంలో ఏవిధంగా అయితే, ఆచితూచి అడుగులు వేసిందో ఆవిధంగానే అడుగులు వేయాలని భావిస్తోంది. కాగా, ప్రస్తుతం ఆండ్రియా చేతిలో కేవలం రెండు, మూడు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి మిషికన్ దర్శకత్వం వహించే ‘పిశాచు-2’, దిల్ సత్య దర్శకత్వం వహించే ‘మాళిగై’తో పాటు ‘కో’ అనే చిత్రాలు ఉన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement