2025తర్వాతే యాంకర్. నటి శ్రీముఖి పెళ్ళి అని చెప్పింది. ఆమె నటించిన క్రేజీ అంకుల్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్నాళ్ళుగా శ్రీముఖి పెళ్లిపై అనేక వార్తలు వస్తున్నాయి. వాలంటైన్స్ డే రోజు సర్ప్రైజ్ విషయాన్ని చెప్పబోతున్నానని శ్రీముఖి అనే సరికి అందరు ఆమె పెళ్లి గురించి అనుకున్నారు. కాని ఆమె మొదలు పెట్టిన వ్యాపారం గురించి వివరించింది. అయితే 31 ఏళ్ళు తనకు నిండిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని అంటుంది శ్రీముఖి. నన్ను చేసుకోబోయే వాడు యాక్టివ్, ఎనర్జిటిక్‌గా ఉండాలి. నన్ను ఎక్కువగా గారాబం చేస్తూ ఉండటంతో పాటు నాకు ఫ్రీ స్పేస్ ను కల్పించాలంటూ పేర్కొంది.అంటే 2025 తర్వాతనే శ్రీముఖి పెళ్లి గురించి మాట్లాడుకోవడం మంచిందని నెటిజన్స్ అనుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement