Wednesday, December 4, 2024

అనన్యాపాండే ఇంట్లో ‘లైగర్’ దర్శక..నిర్మాత

దర్శకుడు పూరీ జగన్నాథ్  ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. క‌రోనా వల‌న దాదాపు 11 నెల‌ల పాటు ఆగిన ఈ సినిమా షూటింగ్ నేటి నుండి శ‌రవేగంగా జ‌రుపుకుంటుంది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత ఛార్మీ కౌర్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.  ముంబైలో కొత్త షెడ్యూల్ మొద‌లు కానుండ‌గా,ఈ సినిమా షూటింగ్ మొద‌లు పెట్టేందుకు పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ రీసెంట్‌గా ముంబై వెళ్లారు.పూరీ టీంకు చిత్ర క‌థానాయిక అన‌న్య పాండే ఆతిథ్యం ఇవ్వ‌గా, వారింట్లో వీరు చేసిన సంద‌డి మాములుగా లేదు. అనన్య తండ్రి చుంకీ పాండే,  త‌ల్లి భావ‌న పాండేతో క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీలు ఫొటోలు దిగారు.  ఈ ఫొటోల‌ను ఛార్మి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అవి వైర‌ల్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement