Tuesday, September 17, 2024

తెలంగాణ దేవుడులో ‘శ్రీకాంత్..సంగీత’

తెలంగాణ దేవుడు చిత్రం రానుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్..సంగీత ప్రధాన పాత్రలలో నటించారు. ఇది 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమధీరుడి జీవిత చరిత్ర కథాంశం ఇది. వడత్యాహరీష్ దర్శకుడు.ఆయన దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని గుమ్మడికాయ కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో మీడియాతో ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ… 1969 నుండి 2014 వరకు తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చడానికి ఒక ఉద్యమ ధీరుడుగా బయలుదేరి వారి కష్టాలను తీర్చిన ఉద్యమ ధీరుడి చరిత్రే  ‘తెలంగాణ దేవుడు’. ఈ చిత్రాన్ని ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ జోడించి మంచి పాటలతో అన్ని రంగాల వారికి నచ్చే విధంగా చిత్రీకరించడం జరిగింది. నా మొదటి చిత్రంతోనే 50 మంది పెద్ద నటీనటులను డైరెక్షన్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement