CI SI | సిఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీసుల కవాత్తు

CI SI | సిఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీసుల కవాత్తు

CI SI | జైనూర్, ఆంధ్రప్రభ : సిర్పూర్ (యు) మండలంలో ఈ నెల 11న జరగనున్న సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు శాంతియుతంగా జరుపుకోవా లని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ఈ రోజు జైనూర్ సిఐ రమేష్, సిర్పూర్ (యు) ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులచే కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐలు మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలందరూ కృషి చేయాలని, ఎన్నికల ప్రచారం 48 గంటల ముందే బంద్ చేయాలని, ముఖ్యంగా ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాజకీయ నాయకులు డబ్బులు పంచితే వెంటనే ఫోన్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజలందరూ కూడా ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎన్నికల్లో అభ్యర్థుల ప్రలోభాలకు గురికాకూడదని స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సిఐ, ఎస్ఐ కోరారు. ఈ కవాతు కార్యక్రమంలో లింగాపూర్ ఎస్సై, స్థానిక పోలీసులు, తెలంగాణ ప్రత్యేక పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply