CI SAIKUMAR | మద్యం పట్టివేత..
వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు
CI SAIKUMAR | బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ సాయికుమార్ (CI Saikumar) తెలిపారు. ఆయన తెల్పిన వివరాల మేరకు మండల కేంద్రం నుంచి ఓని గ్రామానికి బాబూరావు అనే వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.22800 విలువైన 33 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు.

