చౌటుప్పల్‌లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
ఆరుగురు నిందితుల అరెస్ట్.. రూ.26 వేల నగదు, పేకముక్కలు స్వాధీనం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : నమ్మదగిన సమాచారం మేరకు చౌటుప్పల్ పట్టణంలోని మల్లికార్జుననగర్‌లో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధకుమార్ ఆదేశాల మేరకు ఎస్సై బి. అజయ్ భార్గవ్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో సదరు ఇల్లు చౌటుప్పల్ పట్టణానికి చెందిన రెడ్డగోని మల్లేష్‌దిగా గుర్తించారు. మిగిలిన వారిని అంతమ్మగూడెంకు చెందిన రావుల లింగయ్య, పీపుల్‌పహాడ్‌కు చెందిన నల్లెంకి లింగస్వామి, ఆరెగూడెంకు చెందిన దిండి రాఘవరెడ్డి, చౌటుప్పల్‌కు చెందిన తీగల రమేష్, బొంగు రమేష్‌గా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.26 వేల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, ఆరు బైకులు, 106 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ జి. మన్మధకుమార్ తెలిపారు.
