choutuppal | సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ…

choutuppal | సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ…

choutuppal | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎనగండితండలో అనారోగ్యానికి గురై బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కరంటోతు నీలూనాయక్, మార్కెట్ డైరెక్టర్ కరంటోతు శంకర్ నాయక్ లు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులు పానుగోతు సూర కు రూ. 60వేలు, కరంటోతు విజయ్ కు రూ. 60వేలు, కరంటోతు భాగ్యమ్మ కు రూ. 14వేలు చెక్కులను నీలు నాయక్, శంకర్ నాయక్ ల చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపద కాలంలో ప్రభుత్యం అందించే సాయం పేదలకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ఆంగోతు శ్రీనివాస్ నాయక్, వార్డు సభ్యులు జగన్ నాయక్, కిరణ్ నాయక్, శ్రీను నాయక్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply