chityala | ఊరు బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వండి

chityala | ఊరు బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వండి
chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ బలపరిచిన నేరడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాసోజు శంకరాచారి (Kasoju Shankarachari) శనివారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీజేపీ నాయకులు (BJP leaders) తరలివచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారి బండ మధుసూదన్ రెడ్డి (Madhusudhan Reddy) కి నామినేషన్ పత్రాలు అందించారు.
జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాల మధ్య భారీ జనసమూహంతో భారీ ర్యాలీ (Massive rally) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంజి గోవర్ధన్, చెరుపల్లి వేణు, మిర్యాల గోపాలకృష్ణ, కంభంపాటి వెంకన్న, డాక్టర్ చెరుపల్లి శ్రీనివాసులు, వరికుప్పల నరసింహ, ఐతరాజు రమేశ్, వీరమళ్ల శ్రీనివాస్, ఆవుల శ్రీనివాస్, ప్రిన్స్ రమేశ్, శ్రీరామోజు నరేశ్, వంశీ, మల్లేశ్, మిర్యాల వేణు, కర్నాటి వెంకటేశ్, సందీప్ రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
