Navaratri-celebrations | చిట్యాలలో దుర్గామాత ఆగమనం
మంగళహారతులతో మహిళల పూజలు.. కోలాటాలతో సందడి
Navaratri-celebrations | చిట్యాల, ఆంధ్రప్రభ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో హనుమాన్ భజన మండలి, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం దుర్గామాత ఆగమన కార్యక్రమాన్ని నిర్వహించారు. చౌరస్తా నుంచి దుర్గామాత ప్రతిష్ఠాపన వేదిక, బస్టాండ్ వరకు మహిళలు మంగళహారతులతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. గుమ్మడికాయలతో అమ్మవారికి దిష్టి తీశారు. అనంతరం మహిళలు కోలాటాలు, ఆటపాటలతో దుర్గామాతను ర్యాలీగా ప్రతిష్ఠాపన వేదిక వద్దకు తీసుకెళ్లారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తవుటం లక్ష్మి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సరిమ్ముల రాజేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు, విగ్రహ దాతలు బుర్ర సదయ్య–సుజాతతో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Chityala-Durgamata-arrival-Navaratri-celebrations
