chityal | సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం.

సుంకేనపల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య.

చిట్యాల, జనవరి 26 ఆంధ్రప్రభ. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారంతో గ్రామపంచాయతీ పాలకవర్గం కృషి చేస్తుందని సర్పంచ్ ల ఫోరం ప్రధాన కార్యదర్శి గ్రామ సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య తెలిపారు. సోమవారం నాడు చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామ ముత్యాలమ్మ గుడి వరకు సిసి రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి సర్పంచ్ ఆవుల సునీత నిర్మాణ పనులు ప్రారంభించారు

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సర్పంచ్ ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చిన వాగ్దానం మేరకు శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో సిసి రోడ్డు పనులు ప్రారంభించామని సర్పంచ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోసం శేఖర్ రెడ్డి వార్డు సభ్యులు బలుగూరి రజిత బలుగూరి వెంకటేశం కక్కరేని యాదమ్మ భారత రాజు లింగయ్య ఆవుల సోని బుంగ రాజేందర్ భద్ర లింగస్వామి రజిని నాగవాచారి మాజీ సర్పంచ్ కక్కిరేణి బొందయ్య పెదవుల యాదయ్య ఆవుల ఐలయ్య లింగస్వామి విశ్వేశ్వరరావు ప్రవీణ్ కావలి యాదయ్య కావలి కృష్ణ దేవబోయిన మహేష్ బలుగూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply