Chityal | ఇస్రో సందర్శనకు జూకల్ విద్యార్థుల ఎంపిక..

Chityal | ఇస్రో సందర్శనకు జూకల్ విద్యార్థుల ఎంపిక..

విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,

Chityal | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోనిజూకల్‌ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న 50 మంది విద్యార్థిని–విద్యార్థులకు ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) సందర్శనకు అనుమతి లభించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి కృష్ణ శనివారం తెలిపారు . ఈ నెల 26వ తేదీన ఇస్రోను సందర్శించి, రాకెట్లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం పొందడమే కాకుండా, ఇస్రో శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడే అరుదైన అవకాశం కూడా లభించిందన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులనుఅభినందించారు. ఇస్రోను సందర్శించడం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పాఠశాలప్రధానోపాధ్యాయులు జి. కృష్ణ , ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థిని–విద్యార్థులను ఆయనప్రత్యేకంగాఅభినందించారు.జిల్లాలో అవకాశం ఉన్న మరిన్ని పాఠశాలలవిద్యార్థులు కూడా ఇస్రోను సందర్శించే విధంగా చర్యలుతీసుకోవాలని రాహుల్ శర్మ సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ విజయపాల్ రెడ్డి ,పాఠశాలప్రధానోపాధ్యాయులు కృష్ణ , జిల్లా సైన్స్t అధికారి బి. స్వామి , జి సి డి ఓ శైలజ , ప్లానింగ్ ఆఫీసర్ శ్రాజగోపాల్ ఉపాధ్యాయులు నాగవల్లి రూపశ్రీ, మారం స్వరూప, గాజర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Reply