ఒకసారి లోక తత్త్వమును తెలుసుకొనగోరి ప్రహ్లాదుడు తన పరివారాన్ని వెంటబెట్టుకొని దేశాటన చేశాడు. సహ్యాద్రి ప్రాంతంలో కావేరి నది వద్ద ఒంటి నిండా దుమ్ము, ధూళి కొట్టుకొని పడివున్న ఒక వ్యక్తిని చూశాడు. అతని శరీరంపైన వర్ణాశ్రమ ధర్మాల గుర్తులేమీ లేవు. ఆయన చెప్పిన విషయాలు ప్రహ్లాదునికి ఆశ్చర్యాన్ని కల్గించాయి. ‘ప్రహ్లాదా! నేను తేనెటీగను, కొండ చిలువను గురువుగా స్వీకరించి గ్రహించిన రహస్యాన్ని నీకు చెప్పెదను. తేనెటీగ బహు దూర ప్రాంతాల నుండి కష్టపడి పుష్పముల నుండి తేనెను గ్రహించును. చివరకు ఎవరో వచ్చి ఈగలను చంపి తేనెను హరించుకొని పోయెదరు. అట్లే మానవులు కూడబెట్టు ధనము కూడా పరులు దోచుకొందురు గదాయని గ్ర#హంచితిని. కొండచిలువ తానున్న చోటు నుండి కదలక తన నోటి వద్దకు వచ్చే ఆహారాన్ని తిని తృప్తి చెందుతుంది. అట్లాగే మానవులు కూడా తమకు దైవానుగ్ర#హముచే ప్రాప్తించిన దానితో తృప్తి చెందవలెను.” (పుట 461సప్తమ స్కంధము, భాగవత సుధ, శ్రీ రామకృష్ణ తపోవనం, చెన్నై)
భాగవతములోని ఈ కథాంశాన్నుంచి మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. సాధారణంగా కాషాయ వస్త్రాలను ధరించిన సాధువో, పీఠాధిపతో మనకు గురువుగా ఉండాలని, మనకు ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశించాలని, ఆ గురువుకు మనం సేవలను చేసి తరించాలని మనం కోరుకొంటాం. ఇక మనకు జ్ఞానం వచ్చే మాట అటుంచితే దొంగ గురువులకు, సాధువులకు బానిసలమవుతాం. ఇక్కడ తేనెటీగ, కొండచిలువ తన గురువులంటున్నాడు ఆయతి. ఇదే భాగవతములోనే శ్రీ కృష్ణ పరమాత్ముడు చెబుతాడు.
ఇలా ”స్వానుభవానికి మించిన జ్ఞానం మరొకటి ఉండబోదు. లోకమే ఒక గురువు. లోకంలోని చరాచర వస్తువులను పరిశీలించి, గ్రహిచదగిన దాన్ని గ్రహస్తూ, గ్రహించరాని దాన్ని విసర్జిస్తూ క్రమంగా సిద్ధిని సాధించుకోవాలి. (పుట867 ఏకాదశ స్కంధము భాగవత సుధ) ఇక దత్తాత్రేయుడు యదుమహా రాజుతో ఏమి చెప్పాడో విందాం ‘రాజా! నా బుద్ధి ననుసరించి నేను ఎందరో గురువులను ఆశ్రయించాను, నా గురువులు (1) పృథివి (2)వాయువు (3)ఆకాశము(4)జలము (5) అగ్ని (6)చంద్రుడు (7) సూర్యుడు (8)పావురము (9) అజగరము (10) సముద్రము (11) పతంగము (12) తేనె తీయువాడు (13) ఏనుగు (14) తేనెటీగ (15) లేడి (16) చేప (17)పింగళయను వేశ్య (18) కురుర పక్షి (19) బాలుడు (20) కన్య (21) సాలె పురుగు (22) సర్పము (23) బాణము చేయువాడు (24) భ్రమర
కీటకము.
వీని నడవడిని బట్టి జ్ఞానమును పొందితిని’ (పుట-868 ఏకాదశ స్కంధము భాగవత సుధ, శ్రీ రామ కృష్ణ తపోవనం, చెన్నై) ‘ కశషషస| షఠ| శి|ష ష|శ-ఠ|స’అని అంటాడు ఆంగ్ల కవి విలియం వర్డ్స్ వర్త్. లోకమే ఒక గురువని ఏనాడో చెప్పాడు జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్ముడు.
– రాచమడుగు శ్రీనివాసులు