చైనాలోని లాంగ్హువా కౌంటీలో దుర్ఘటన
బీజింగ్: చైనాలోని ఓ నర్సింగ్ హోమ్‌లో నేటి ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని లాంగ్హువా కౌంటీలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఓ నర్సింగ్ హోమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా జిన్హువా వెల్లడించింది. అలాగే, పలువురు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొంది. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

