Chilakaluripet | ఆటో బోల్తా… నలుగురికి గాయాలు

Chilakaluripet | చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మండలంలోని తాతపూడి హైవే వద్ద ఆటో బోల్తా పడిన సంఘటనలో ఆటోలో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాల‌య్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఈఎంటి శోభన్ బాబు, పైలట్ శివనాగాంజనేయులు హుటాహుటిన ప్రమాద స్థలాన్ని చేరుకొని వారిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం సత్తెనపల్లి నుంచి ముప్పవరం వెళుతున్న ఆటోను లారీ ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోవడంతో ఆటో బోల్తా పడి నలుగురికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వారి వివరాలు గుండాల కోటేశ్వరరావు, గుండాల నాగేంద్రం, గడ్డం వెంకటేశ్వర్లు, నామాల వీరబ్రహ్మం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply