Chief Minister | దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి…

Chief Minister | దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి…

Chief Minister | మక్తల్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(Kalvakuntla Tarakarama Rao) పిలుపు మేరకు ఈనెల 29న జరగనున్న దీక్షా దివస్(Deeksha Divas) కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మక్తల్ పట్టణ అధ్యక్షుడు జె.చిన్న హన్మంతు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) తెలంగాణ వచ్చుడో…. కేసీఆర్ సచ్చుడో(KCR Sachdu) అన్న నినాదంతో నాడు ప్రాణాలను లెక్క చేయకుండా చేపట్టిన దీక్ష రోజు నవంబర్-29-2009ని దీక్షా-దివస్ గా పిలుచుకుంటామని అన్నారు.

కేసీఆర్ పోరాట స్పూర్తికి నిదర్శనం ఈ దీక్ష-దివస్ అని ఆయన పేర్కొన్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన రోజు కాబట్టి నారాయణపేట జిల్లా(Narayanapet District) బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 29న శనివారం రోజు ఉదయం 10:00 గంటలకు జరిగే దీక్ష-దివస్ కార్యక్రమనికి మక్తల్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ, మండలంలోని పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల అధ్యక్షుడు, మాజీ మున్సిపాలిటీ కౌన్స్లర్లు, మాజీ సర్పంచులు, మాజీ వార్డ్ మెంబర్లు, మాజీ సింగిల్విండో చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ దీక్ష-దివస్ కార్యక్రమన్నీ విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply