న్యూ ఢిల్లీ అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారీ ఎన్నికయ్యారు. దీనికోసం జరిగిన ఎన్నికలలో భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ సింగ్ 193 ఓట్టకు గాను 183 ఓట్లు సాధించి బ్రిటన్‌కు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్‌వుడ్‌ను ఓడించారు. దీంతో ఈ న్యాయమూర్తి పదవిపై 71 ఏళ్లుగా కొనసాగుతున్న బ్రిటన్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టినట్లైంది.. దీన్ని సాధించేందుకు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 6 నెలలుగా తీవ్రంగా శ్రమించాయి! మొత్తం 193 దేశాల ప్రతినిధులను సంప్రదించి సులువుగా గెలుస్తామన్న బ్రిటీష్ అభ్యర్థిపై భారత్ వైఖరిని వివరించడం చాలా కష్టమైన పని. పదకొండవ రౌండ్ ఓటింగ్‌లో జస్టిస్ దల్వీర్ భండారీ జనరల్ అసెంబ్లీలో 193 ఓట్లకు 183 మరియు యుఎన్ భద్రతా మండలిలో 15 ఓట్లకు 15 వచ్చాయి.
తొమ్మిదేళ్ల పాటు..
ప్రధాన న్యాయయూర్తిగా విజయం సాధించిన జస్టిస్ దల్వీర్ భండారీ 9 ఏళ్లపాటు ఈ హోదాలో కొనసాగుతారు. ఈ 183 దేశాలు భారతదేశానికి ఓటేశాయి. మరో విశేషం ఏమిటంటే ఓటు వేసిన ఏ ఒక్కదేశం మోడీ భక్తులు” కాదు! వారందరూ ఆలోచనాత్మకంగా ఉండంటంతో భారతీయ న్యాయకోవిడుకి పట్టం కట్టారు.. మనకు స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత మన ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో ఎంత మర్యాద, గౌరవం మరియు సత్సంబంధాలను ఏర్పరచుకున్నారో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ.