చెరువుల్లా.. కార్యాలయాలు

కమ్మర్ పల్లి: నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కమ్మర్ పల్లి (
Kammarpally) మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ రోజు మండ‌ల ప‌రిష‌త్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, ఐకెపి కార్యాలయాల చుట్టూ, కస్తూర్బా బాలికల పాఠశాలలో (Kasturba Girls’ School) భారీగా వరద నీరు చుట్టుముట్టాయి. పోలీస్ స్టేషన్‌(Police Station)లో భారీగా వరద నీరు చేరింది. దీంతో చెరువుని త‌ల‌పిస్తున్నాయి. మండల కేంద్రంలోని ఉప్లూర్ రోడ్డు వరద కేనాల్ వద్ద గల రోడ్డు కల్వర్టు వరద నీటి ప్రవాహానికి కోతకు గురై రోడ్డు సగభాగం కొట్టుకుపోయింది.

Leave a Reply