Chennaraopet | తండాలో కొట్లాట..

Chennaraopet | తండాలో కొట్లాట..
Chennaraopet, చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మూడో విడత జిపి సర్పంచ్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మంగళవారం అర్ధరాత్రి మండలంలోని చెరువుకొమ్ము తండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు కొట్లాటకు దిగారు. తండాలో ఓ దగ్గర చలి కాచుకుంటున్న సమయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటా మాటా పెరిగి మంట కర్రలు, రాళ్లతో ఒకరి పై మరొకరు పరస్పర దాడులు చేసుకున్నారు.
పోలీసులకు సమాచారం అందడంతో తండాకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయలపాలైన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పై విచక్షణరహితంగా దాడి చేశారని.. మా కార్యకర్తలకే దెబ్బలు తగిలాయని, దాడులకు పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దాడులకి సంబందించిన దృశ్యాలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి.
