Chemical factory | ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవాలి….
Chemical factory | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో ఈనెల 7న జరగనున్న కెమికల్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవాలని పట్టణానికి చెందిన యువకులు తీర్మానించారు. ఇవాళ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద యువకులు, పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. కెమికల్ పరిశ్రమ వద్దు.. బిక్కనూరు ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీలకు అతీతంగా యువకులు మాట్లాడుతూ… ఫార్మా కంపెనీ వల్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవాలని వారు కోరారు. ఈనెల 7న బిక్కనూర్ పట్టణ బంద్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలందరూ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లి ఫ్యాక్టరీని వ్యతిరేకించాలని వారు కోరారు. వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయాలని వారు తెలిపారు. భావితరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒకరు ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు.

