Cheetah | ఎక్కడంటే….

Cheetah | ఎక్కడంటే….
Cheetah | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చిరుత ఐదు ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చిన ఘటన కూనో జాతీయ పార్కులో చోటుచేసుకుంది. ఆశా అనే చిరుత ఐదు పిల్లలకు జన్మనిచ్చినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. దీంతో భారతదేశంలో చిరుతల సంఖ్య 35కి చేరింది. దశాబ్దాల క్రితం అంతరించిపోయిన చిరుతల జనాభాను పునరుద్ధరించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగంగా నమీబియా నుండి ఆశాను భారతదేశానికి తరలించారు. భారతదేశంలో జన్మించిన పిల్లల సంఖ్య 24కి పెరిగింది. ఈ విజయం అటవీ సిబ్బంది, పశువైద్యుల అంకితభావానికి నిదర్శనమని, రాష్ట్రం వన్యప్రాణుల సంరక్షణకు కేంద్రంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
