ఇది కూటమి సర్కారు మోసం

ఏడాది దాటిన షాదీఖానా పూర్తి కాలేదు
జగన్ సీఎం అయితే పూర్తి చేసేవాళ్ళం..
2014 నుంచి ఎమ్మెల్చే తాత్సారం
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూనే ఉందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ (Devineni Avinash) విమర్శించారు. మైనారిటీ (Minority)ల ఆశలు ఆకాంక్షలు హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో 9వ డివిజన్ వైవీ రావు హాస్పిటల్ సమీపంలోని నిలిచిపోయిన షాదిఖానా (Shadikhana) నిర్మాణాన్ని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్, వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ , మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రాహుల్లా , మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసిఫ్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, 19వ డివిజన్ కార్పొరేటర్ (Corporator) రెహనా నహీద్, కో ఆప్షన్ సభ్యులు అలీమ్ తో కలిసి బుధవారం పరిశీలించారు. నిర్మాణం ఆగిపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీలు, వైసీపీ నేతలు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా నిర్మాణాన్ని తమ ప్రభుత్వ హయంలో ప్రారంభించామని, మైనార్టీల కోసం జగన్ హయంలో ఆర్ అండ్ బీ స్థలాన్ని మున్సిపల్ శాఖకు బదిలీ చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిన నిర్మాణం పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మైనార్టీలను మోసం చేశారని, 2014 నుంచి షాదీఖానా విషయంలో అబద్ధాలు చెబుతూనే ఉన్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అధికారంలోకి రాగానే తాను ఇక్కడి విషయాన్ని తెలియచేశానని, జగన్ చిత్తశుద్ధితో కృషి చేశారని, ఎన్ని ఇబ్బందులు ఉన్న షాదిఖానా నిర్మాణం ప్రారంభించామన్నారు. జగన్ మోహన్ రెడ్డి రెండవ సారి సీఎం అయి ఉంటే ఈ పాటికే షాదీఖానా పనులు పూర్తయ్యేవని అవినాష్ అన్నరాఉ. 2014లో మైనార్టీలను గద్దె రామ్మోహన్ (Gadde Rammohan) ఏ విధంగా మోసం చేశారో ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. ఈ షాదీఖాన పూర్తి అయ్యే వరకు మైనార్టీ లందరికీ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply