ఆర్టీసి బస్సుల సమయాల్లో మార్పు.. ప్రయాణీకుల అగచాట్లు
పోలవరం, ఆంధ్రప్రభ: పోలవరం నుండి రాజమహేంద్రవరం,నిడదవోలు నిత్యం రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల సమయాలు మార్పుచేయడంతో బుధవారం ప్రయాణీకులు,విధ్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు. బస్సుల రాక కోసం 40 నిమిషాలపాటు పోలవరం బస్ స్టాపులో పడిగాపులు కాయాల్సి వస్తుందని ప్రయాణీకులు, ముఖ్యంగా విద్యార్థులు వాపోతున్నారు.ఉదయం 8.20 నిమిషాలకు వచ్చే బస్సుల సమయాలు 9 గంటలకు మార్చడంతో నిత్యం రాక పోకలు సాగించే విధ్యార్థులు కళాశాలలకు పాఠశాలలకు చేరుకోవడానికి ఆలస్యమవుతుందని తరగతులకు అందుకోలేక పోతున్నామని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఆలస్యమవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. వ్యాపారాలు పాడవుతున్నామని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి గత సమయాలనే కొనసాగించాలని కోరుతున్నారు. ఉదయం సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేకంగా సర్వీసులు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.
