ఆటోవాలా ఆనందోత్సాహం
- తిరువూరులో భారీ ర్యాలీ
- ఎమ్మెల్యే కొలికపూడికి నీరాజనం
(ఆంధ్రప్రభ, తిరువూరు) : కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా ఆర్థిక సహాయాన్ని అందజేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కి కృతజ్ఞతగా తిరువూరు పట్టణంలో మంగళవారం ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు.
పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి నుంచి మధిర రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వరకు వందలాది ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivas Rao) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆటో డ్రైవర్ల అందరికీ ఆర్థిక సహాయం చేసిన కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆటో డ్రైవర్లు తెలిపారు.