Chandrakanth Reddy | పాఠకుల హృదయాల్లో నిలిచిన పత్రిక ఆంధ్రప్రభ..
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర కాంత్ రెడ్డి
Chandrakanth Reddy | బిక్కనూర్, ఆంధ్రప్రభ : పాఠకుల హృదయాల్లో ఎంతగానో ఆకట్టుకుంటూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఆంధ్రప్రభ దినపత్రిక పనిచేస్తుందని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు . ఇవాళ ఆంధ్రప్రభ దినపత్రికకు సంబంధించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… దశాబ్ద కాలంగా ఆంధ్రప్రభ దినపత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తుందని గుర్తు చేశారు.
ఆంధ్రప్రభలో వస్తున్న పలు శీర్షికలు చదవడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రభ దినపత్రికతో పాటు స్మార్ట్ ఎడిషన్, యూట్యూబ్ ఛానల్, వెబ్ న్యూస్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేరుస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రభ యజమాన్యం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతిరోజు ఆంధ్రప్రభ దినపత్రిక చదవడం తనకు అలవాటుగా మారిందన్నారు. విభిన్న కథనాలతో ఆంధ్రప్రభ దినపత్రిక ప్రజల్లోకి వెళ్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జిల్లా గ్రంథాలయ శాఖ తరపున ఆంధ్రప్రభ దినపత్రిక యాజమాన్యం సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రభ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ జంగం బాల ప్రకాష్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అంకం రాజు, జనార్దన్ రెడ్డి, పున్న అఖిల్, వాసవి క్లబ్ అధ్యక్షులు అల్లాడి సుదర్శన్, తదితరులు ఉన్నారు.

