Chandrababu Vijay meeting |చంద్రబాబు–విజయ్‌ భేటీ.. తెలుగు గంగపై కీలక చర్చ

విజయవాడ, ఆంధ్ర‌ప్ర‌భ‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలుగు గంగ పథకం ద్వారా చెన్నైకి నీటి విడుదల అంశంపై చర్చించారు. చెన్నై తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరాను పెంచాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది ఇప్పటికే చెన్నైకి 4.08 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ అందించింది. రాష్ట్రంలో నీటి లభ్యత, జలాశయాల్లో నిల్వలను పరిగణనలోకి తీసుకుని తదుపరి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు, గోదావరి–కావేరి నదుల అనుసంధాన అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య నీటి వనరుల వినియోగం, భవిష్యత్తులో తాగునీటి అవసరాలపై చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. భేటీ అనంతరం తమిళనాడు సీఎం విజయ్‌ విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్నారు.