ఆడ-మగ మొక్కజొన్న… రైతులో ఆందోళన

ఆడ-మగ మొక్కజొన్న… రైతులో ఆందోళన

కొనుగోళ్లలు చేయని కంపెనీ యజమానులు,
చాందిని సీడ్ కంపెనీ యజమానులపై చర్యలు తీసుకోవాలి,
మక్కలు వెంటనే కొనుగోలు చేపట్టాలి,

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఎలేటి రామయ్య పల్లి , నవాబుపేట కు చెందిన 30 మంది రైతులు యాసంగిలో 40 ఎకరాల్లో ఆడ మగ మొక్కజొన్న చాందిని సీడ్ వేశారు. కోతక్కొచ్చిన దశలో కంపెనీ యజమానులు, కొనుగోలు చేయకపోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. యజమానులు వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు , చాందిని సీడ్స్, మంచి దిగుబడి వస్తదని 30 మంది రైతులను నమ్మబలికి 40 ఎకరాలలో సీడ్ మొక్కజొన్న వేయించారని, బాధిత రైతులు, కసిరెడ్డి తిరుపతి రెడ్డి. కనుకుల రమాకాంత్ రెడ్డి. జగన్ , మహిపాల్ , శ్రీనివాస్ లు తెలిపారు.


కోత కోసే సమయంలో చాందిని సీడ్స్ యజమానులు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ రైతులను పట్టించుకోకుండా సీడ్ యజమానులు చేతులెత్తేయడంతో, దిక్కుతోచని స్థితిలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, బాధిత రైతుల మొక్కజొన్న చేన్లోకి వెళ్లి పంటలను పరిశీలిం చారు .చాందిని సీడ్స్ కంపెనీ యజమానులు రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయకుండా చాందిని సీడ్స్ కంపెనీ యజమానులు కాలయాపన చేస్తున్నారని , పండిన పంటకి క్వింటాకు రూ 3200 చెల్లిస్తామని చెప్పి
రైతులకు బాండ్ పేపర్లు రాసి, మోసం చేయడం తగదన్నారు. రైతు పండించిన పంటను కొనుగోలు చేసి, రైతులకు డబ్బులను చెల్లించాలి డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో ఏలేటి రామయ్య పల్లె గ్రామ సర్పంచ్ కోడారి అశోక్. రైతులు కాశిరెడ్డి తిరుపతి రెడ్డి. రమాకాంత్ రెడ్డి. కనుకుల జగన్ ,కనుకుల మహిపాల్ , శ్రీను వాస్ ,తదితర రైతులు పాల్గొన్నారు.

Leave a Reply