Champions Trophy | పాక్ తొలి వికెట్ డౌన్..
- హార్ధిక్ బ్రేక్ – బాబర్ ఔట్ !
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది.
8.2వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన బంతికి ఓపెనర్ మాజీ కెప్టెన్ బాబర్ అజమ్ శర్మ ఔటయ్యాడు. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన బాబర్ 26 బంతుల్లో 5 ఫోర్లుతో 23 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఇక ప్రస్తుతం క్రీజులో ఇమామ్-ఉల్-హక్ (10) – సౌద్ షకీల్ ఉన్నారు. పాకిస్థాన్ స్కోర్ 9వ ఓవర్లకు 41/1.