Champions Trophy | వ‌రుస‌గా రెండు వికెట్లు కోల్పోయిన పాక్

అక్షర్ త్రో కి ఇమామ్-ఉల్-హక్ ర‌నౌట్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది.

9.2వ ఓవ‌ర్లో కుల్దీప్ యాద‌వ్ వేసిన బంతికి ఓపెన‌ర్ ఇమామ్-ఉల్-హక్ రన్ తీస్తుండగా అక్షర్ వేసిన్ త్రో కి ర‌నౌట్ అయ్యాడు.

అంతకుముందు ఓపెన‌ర్ గా బాబ‌ర్ తో క్రీజులోకి వ‌చ్చిన ఇమామ్ 26 బంతుల్లో 10 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు.

ఇక‌ ప్ర‌స్తుతం క్రీజులో – సౌద్ షకీల్ (2) – కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ఉన్నారు. పాకిస్థాన్ స్కోర్ 9.2వ ఓవ‌ర్ల‌కు 47/2.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *