Champions Trophy Finals | డారిల్ మిచెల్ హాఫ్ సెంచ‌రీ !

దుబాయ్ : చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట‌ర్ డారిల్ మిచెల్ అర్థ సెంచ‌రీ న‌మోదు చేశాడు. భారత్‌తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో, కివీస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, వరుసగా వికెట్లు కోల్పోయిన క‌ష్టాల్లో ప‌డిన జ‌ట్టు అర్ధ సెంచరీతో ఊపిరందించాడు మిచెల్.

91 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్ తో 50 ప‌రుగులు చేసి.. హాఫ్ సెంచ‌రీ సాధించాడు. టామ్ లాథమ్‌తో (33 పరుగులు), గ్లెన్ ఫిలిప్స్‌తో (57 పరుగులు) కీల‌క‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మిచెల్.. జట్టును నెమ్మదిగా ముందుకు న‌డిపిస్తున్నాడు.

కాగా, ప్ర‌స్తుతం క్రీజులో డిరిల్ మిచెల్ (50) – మిచెల్ బ్రేస్‌వెల్‌ గ్లెన్ ఫిలిప్స్ (6) ఉన్నారు. న్యూజిలాండ్ స్కోర్ 176/5

Leave a Reply