ఈనెల 25న చలో ఏర్పేడు..

భావితరాలకు ధర్మాన్ని అందించాలంటే వ్యాసాశ్రమను రక్షించాలి..


తిరుపతి సిటీ, జులై 20 (ఆంధ్రప్రభ ): జిల్లా ఏర్పేడు వద్ద గల వేసాశ్రమం నందు జూలై 25న శాంతియుత నిరసన దీక్ష చేపట్టుతున్నట్టు శివానంద స్వామి తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వామీజీ మాట్లాడుతూ మహర్షి సద్గురు మలయాళ స్వామి ఆరాధన ఉత్సవం సందర్భంగా వందలాది మంది భక్తులతో,పూర్వ విద్యార్థులతో,స్వామీజీలతో, భక్తాదులతో నిరసన దీక్ష చెపడుతున్నట్లు చెప్పారు. కేరళలో పుట్టిన మలయప్ప స్వామి ఆంధ్రను ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చి యందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. ఆశ్రమం మేనేజరు, పీఠాధిపతులు, నిరసన దీక్షను అడ్డుకోవాలని చూస్తే చట్టపరంగా, శాంతియుతంగా ముట్టడించాల్సి వస్తుందని హెచ్చరించారు.

గతంలో బాలికలతో పాటు బాలురులకు సంస్కృతం,వేద పాఠశాల ఉండేవి అని,అవన్నీ ఇప్పుడు కనుమరుగయ్యాయని, వేసాశ్రమానికి మునుపటి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, వాటన్నిటిని తిరిగి ఏర్పాటు చేయాలనే ఆకాంక్షతోనే నిరసన దీక్షకు దిగుతున్నట్లు చెప్పారు. రోజు రోజుకు వేసాశ్రమం ఖ్యాతి దిగజారుతున్నదని అన్నారు.

ఈ విషయమై దేవదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి విన్నవించినా ఫలితం లేదని చెప్పారు. భావితరాలకు ధర్మాన్ని అందించాలంటే వ్యాసాశ్రమను మనం రక్షించుకోవాలని భక్తాదులకు సూచించారు. ఈ కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, కేరళ,నుండి భక్తులు ఈ నిరసన దీక్షలో అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు.ఈ సమావేశంలో స్వామీజీలు పాల్గొన్నారు.