కుక్కల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు
చల్లపల్లి, ఆంధ్రప్రభ : చల్లపల్లి మండలం రామానగరంలో వృద్ధురాలిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని కోటేశ్వరమ్మ (70)గా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను 108 వాహనంలో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
కుక్కల దాడిలో ఆమె ముఖం తీవ్రంగా గాయపడటంతో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
