తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు నివాళి
ఐలమ్మ ఆశయాల సాధనకు రజకులు ఐక్యంగా కృషి చేయాలి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు బుధవారం బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పోచమ్మ చెరువు ప్రాంతంలో ఉన్న రజక సంఘం కార్యాలయ ఆవరణలో బెల్లంపల్లి రజక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పెండ్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దురిశెట్టి అంజయ్య, నస్పూరి భీమన్న, ఈసంపెళ్లి చందు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్రను స్మరించుకున్నారు.
చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని వారు పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాల సాధన కోసం రజకులు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అంతగిరి శంకర్, నాయకులు కొత్తపల్లి రాజన్న, సంఘం రమేష్, ఉండాల రమేష్, ఉషికే కనకేష్, ఉండ్రాజుల శ్రీనివాస్, సట్టాల మధుయ్య, ఎదునూరి సమ్మయ్య, గూడపు రాజేందర్, తోటపల్లి శంకర్, గుండాల మల్లేష్, కోరుట్ల రవి, సట్టాల సత్యం, కుదురుపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు.
