ఎమ్మెల్యే సామెల్ కి కృతజ్ఞతలు తెల్పిన మున్సిపల్ చైర్మన్

ఎమ్మెల్యే సామెల్ కి కృతజ్ఞతలు తెల్పిన మున్సిపల్ చైర్మన్


మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం స్వప్న సోమనర్సయ్య దంపతులు మంగళవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ని హైదరాబాద్ లో ఆయన నివాసంలో స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం తో చైర్మన్ గా నియామకానికి సహకరించడం పట్ల వారు ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ ని చైర్మన్ దంపతులు స్వయంగా శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బద్దం నాగార్జున రెడ్డి,అర్ధ ప్రతాప్ రెడ్డి, జిట్ట నరేష్, రమేశ్,కొప్పుల సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply