కేసముద్రం, జులై 18(ఆంధ్రప్రభ) : మహిళ మేడలోంచి చైన్ స్నాచింగ్ (Chain snatchers) చేసి బైక్ పై పారిపోతున్న దొంగలను సీసీఎస్ పోలీసులు (CCS Police) అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ (Mahbubabad) జిల్లా కేసముద్రం మండలంలోని కల్వల గ్రామానికి చెందిన బొడ్డు వెంకటమ్మ శుక్రవారం పొలం పనుల నిమిత్తం బావి దగ్గరికి వెళ్తోంది.
ఈనేపథ్యంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు (Two thieves) ఆమెను అడ్డగించి మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు. సమాచారం తెలుసుకున్న సీసీఎస్ పోలీసులు ఆలేరు సమీపంలో చైన్ స్నాచింగ్ చేసిన దొంగలను పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చైన్ స్నాచింగ్ చేసిన దొంగలను దొంగతనం చేసిన గంట వ్యవధిలో పట్టుకున్న పోలీసులను మండల ప్రజలు అభినందిస్తున్నారు.

