Certificate | హార్వర్డ్ కెనడీ స్కూల్ సర్టిఫికెట్

Certificate | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెనడీ స్కూల్ నుండి ప్రముఖమైన ‘లీడర్షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్ పొందారు. ఈ కోర్సు 25 నుండి 30 డిసెంబర్ 2023 మధ్య నిర్వహించబడింది. ఇందులో 20దేశాల నుండి వచ్చిన 60మంది విద్యార్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కోర్సును పూర్తి చేసిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి తన అనుభవాలను ఎక్స్‌లో పంచుకున్నారు. అక్కడ తనకు లభించిన శిక్షణ, నేర్చుకున్న విషయాలు, అలాగే టీచర్స్, తోటి విద్యార్థులతో కలసి జరిపిన చర్చలు ఆయన వ్యక్తిగత, నాయకత్వ దృక్పథంలో ఎంతో ప్రగతి కలిగించాయని తెలిపారు.
