గన్నవరంలో కేంద్ర బృందం

గన్నవరంలో కేంద్ర బృందం

గన్నవరం, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను (mantha cyclone) కారణంగా కృష్ణా జిల్లాలో పంట నష్టాన్ని అంచనా వేయుటలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లాలో కేంద్ర బృంద సభ్యులు (central team) పర్యటించారు. గన్నవరం ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన పంట నష్టపోయిన ఫోటోలతో కూడిన ఎగ్జిబిషన్ పరిశీలించారు.

ఈ పరిశీలనలో అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ డైరెక్టర్ కె.పొన్ను సామి, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ (సిడబ్ల్యూ) శ్రీనివాను ఛైరీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, మినిస్టీ ఆఫ్ పవర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్తి సింగ్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ మనోజ్ కుమార్ కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.

Leave a Reply