బీఎల్సీ పథకం అమలే నిదర్శనం..
పాయకాపురం, అక్టోబర్6(ఆంధ్రప్రభ): విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు బీఎల్సీ పథకం ద్వారా రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక 64వ డివిజన్ కండ్రికలో బిఎల్సీ స్కీం పధకం ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే బొండా ఉమా శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం మరోసారి బీఎల్సీ పథకం అందుబాటులోకి వచ్చిందన్నారు.
ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నామనడానికి బీఎల్సీ పథకం అమలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విమర్శించిందని, అయితే ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
ముఖ్యంగా వృద్ధులు, వితంతువులకు పెంచిన పింఛన్‌ను అమలు చేసి, సామాజిక భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్, ప్రధాన కార్యదర్శి బాబు, పొన్నంగిరి శేషగిరిరావు, వింజమురి సతీష్ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
