Central Government | ఆ సెగ ఇండియాకి తాక‌కూడ‌దు!

Central Government | ఆ సెగ ఇండియాకి తాక‌కూడ‌దు!

  • నేపాల్‌లో మ‌త ఘ‌ర్ష‌ణ‌లు
  • స‌రిహ‌ద్దు మూసివేసిన‌ భార‌త్‌

Central Government | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : నేపాల్‌లో జ‌రుగుతున్న మ‌త ఘ‌ర్ష‌ణ‌లు సెగ భార‌త్‌కు తాకకూడ‌దని కేంద్ర ప్ర‌భుత్వం(Central Government) ఓ నిర్ణ‌యం తీసుకుంది. నేపాల్‌లో మ‌త ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మై ప్ర‌భుత్వం భార‌త్ సరిహ‌ద్దును మూసివేసింది.

భద్రతా కారణాల రీత్యా, ముందస్తుగా కేంద్ర‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేపాల్ లోని పార్సా జిల్లా, బిర్గంజ్ పట్టణంలో నిరసనలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇటీవల నేపాల్ లోని ధనుషా జిల్లా, కమలా మున్సిపాలిటీకి చెందిన హైదర్ అన్సారీ, అమానత్ అన్సారీ అనే ఇద్దరు ముస్లింలు సోషల్ మీడియా(Social Media)లో ఒక మతాన్ని కించపరుస్తూ, రెచ్చగొట్టేలా వీడియో విడుదల చేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో ఆ మతానికి చెందిన వారు ఆందోళన దిగారు. దీంతో ధనుషా, పార్సా జిల్లాలో ఆందోళనలు పెరిగాయి. స్థానికులు ఆ ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే సమయంలో కొందరు కమలా ప్రాంతాంలోని ఒక మసీదును ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.

ఈ క్రమంలో కొందరు పోలీసు స్టేషను(Police Station)పై కూడా దాడి చేసి, రాళ్లు విసిరారు. ఈ దాడుల‌ను అణిచివేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నేపాల్ లోని హిందువులు ఈ ఘర్షణల్లో అధికంగా పాల్గొంటున్నారు. తమ దేవతల‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం పార్సా జిల్లాలోని బిర్గంజ్ ప్రాంతంలో ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

దీంతో అధికారులు అక్కడ కర్ఫ్యూ విధించారు. ఈ ప్రాంతం బిహార్ లోని రాక్సాల్ జిల్లాకు దగ్గరగా ఉంటుంది. అందువల్ల అక్కడి ప్రభావం బీహ‌ర్‌పై పడకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. నేపాల్-భారత్ సరిహద్దుల‌ను పూర్తిగా మూసేసి, రాకపోకల‌ను నిషేధించారు. అత్యవసర సేవల‌ను కూడా నిలిపివేశారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Leave a Reply