AP| ఘోర ప్రమాదం…

గ్యాస్‌ సిలిండర్ల లారీని ఢీకొన్న సిమెంట్‌ ట్యాంకర్‌..
ఇద్దరికి గాయాలు


AP| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీని సిమెంట్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. ఢీకొన్న ఘటనలో గ్యాస్‌ సిలిండర్లు రోడ్డుపక్కకు పడిపోయాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సిలిండర్లు భారీగా ఉండటంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని భయాందోళనకు గురయ్యారు.

అయితే అదృష్టవశాత్తూ గ్యాస్‌ సిలిండర్లకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సిలిండర్లు పేలి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.